AP: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ టీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక
టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు తిరుగుబాటుకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కనంపల్లి ప్రసాద్ అనే
టీడీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ‘బండారు శ్రావణిని గెలిపించి తప్పు చేశాం. మా చెప్పుతో పదిసార్లు కొట్టుకున్నా కూడా మా పాపం ఊరికే పోదు. పోలీసులు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. మేమేమైనా నక్సలైట్లమా? ఉగ్రవాదులమా? ఎమ్మెల్యే స్వార్థపరురాలు.. ఆమె తల్లి అవినీతిపరురాలు’ అని
టీడీపీ కార్యకర్త కనంపల్లి ప్రసాద్ మండిపడ్డారు.