AP: చంద్రబాబు రెండేళ్ల ప్రభుత్వ పాలనపై
వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, బాండ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసాలను ఎండగట్టేందుకు జూన్ 4 నుంచి 12 వరకు 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు 'సూపర్ సిక్స్' సూపర్ ఫ్లాప్ షో అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో
వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు 'గొడ్డలి పార్టీ' అని డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని అన్నారు.