నిత్యావసర ధరలు తగ్గేలా చూడాలి: సీఎం చంద్రబాబు

6442చూసినవారు
నిత్యావసర ధరలు తగ్గేలా చూడాలి: సీఎం చంద్రబాబు
AP: రైతులను ఆదుకోవాలని, నిత్యావసర ధరలు తగ్గేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదివారం ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం చంద్రబాబు అధికారులు, కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపు చేయాలన్నారు. హార్టీకల్చర్ పంటల రక్షణకు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్