AP: రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ముఖ్య నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మాత్రం తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని కోరుతూ, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.