రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం: వైవీ సుబ్బారెడ్డి

24చూసినవారు
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం: వైవీ సుబ్బారెడ్డి
AP: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాయని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్