నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను తరలిస్తాం: మంత్రి లోకేశ్

8575చూసినవారు
నేపాల్‌లో చిక్కుకుపోయిన ఏపీ వాసులను సురక్షితంగా స్వస్థలాలకు తరలిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ భవన్‌లో టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి, నేపాల్‌లో ఉన్న 217 మంది రాష్ట్ర వాసులను గుర్తించినట్లు తెలిపారు. వీరిని గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ, కడపకు తరలించే బాధ్యత తీసుకుంటామని మంత్రి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్