AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో జరిగిన ఉక్కు పరిరక్షణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 32 మంది త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ ఎందుకు ప్రధాని ని కలవలేదని ప్రశ్నించారు.