ఈ నెలాఖరులోగా నామినేటెడ్‌ పదువులు భర్తీ చేస్తాం: లోకేష్‌

16744చూసినవారు
ఈ నెలాఖరులోగా నామినేటెడ్‌ పదువులు భర్తీ చేస్తాం: లోకేష్‌
AP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మంత్రి నారా లోకేష్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీలోని ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. జోనల్ కోఆర్డినేటర్లు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలతో సరైన సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చామని ఎవరూ నిర్లక్ష్యంతో ఉండకూడదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :