ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. దశాబ్దాల క్రితమే తెలుగువారు అమెరికాకు వచ్చారని, కష్టకాలంలో ప్రవాసాంధ్రులు తమ కుటుంబానికి అండగా నిలిచారని ఆయన అన్నారు. స్పీడ్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రవాసాంధ్రులకు ఏ కష్టం వచ్చినా ఏపీఎన్ఆర్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.