అధికారంలో ఉన్నాం కదా అని హద్దు మీరితే ఊరుకోం: అమర్నాథ్

4374చూసినవారు
AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన వైసీపీ సభలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదని, అధికారులు హద్దు మీరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేయడం దారుణమని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్