TG: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నా.. ఏపీ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. తెలంగాణ నీళ్లు దోచుకుంటే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మట్లాడుతూ.. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే.. ఏపీ ప్రభుత్వం కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని తరలించడం అన్యాయమని మండిపడ్డారు.