తప్పుడు పోస్టులు పెట్టేవారిని సహించం: హోంమంత్రి అనిత

0చూసినవారు
తప్పుడు పోస్టులు పెట్టేవారిని సహించం: హోంమంత్రి అనిత
సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు, కల్పిత వీడియోలు పెట్టి ఇబ్బంది పెట్టేవారిని సహించబోమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. తుళ్లూరు పోలీస్‌ సబ్‌ డివిజన్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనను ఏపీలో జరిగినట్లు ప్రచారం చేసినా, ఏపీ పోలీసులు అలాంటి తప్పుడు వార్తలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. కోటి రూపాయల బీమాతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని, పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :