కూటమి ప్రభుత్వాన్ని ప్రజా స్వామ్య పద్ధతిలో కూలుస్తాం: అంబటి రాంబాబు

20చూసినవారు
కూటమి ప్రభుత్వాన్ని ప్రజా స్వామ్య పద్ధతిలో కూలుస్తాం: అంబటి రాంబాబు
AP: తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఇడుపులపాయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసే వరకు తన పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేశారు. ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాటం చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్