AP: ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అర్హులైన పేదవారికి సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, పొలిటికల్ గవర్నెన్స్ కూటమి ప్రభుత్వ విధానమని, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.