AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వీడియోలో మాటలు ఉన్నాయి. రౌడీషీటర్ల వీడియో రిలీజ్ అంశం తమ దృష్టికి రాలేదని నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడుతాం, ఆయన కోరితే రక్షణ కల్పిస్తామని ఎస్పీ చెప్పారు.