AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. MLAలు, ఎంపీలు అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళదామని జగన్ తెలిపారు. తాను అసెంబ్లీకి వెళ్లవద్దని ఎవరికీ చెప్పలేదని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా.. కనీసం అసెంబ్లీలో మాట్లాడే టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ అన్నారు.