రాధాగాయత్రి కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి అనిత

15చూసినవారు
AP: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో మృతి చెందిన టెకీ రాధాగాయత్రి కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో రాధాగాయత్రి తల్లిదండ్రులు సోమవారం హోంమంత్రి అనితను కలిశారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని శిక్షించాలని కోరారు. ఈ మేరకు హోంమంత్రి అనితకు వారు వినతిపత్రం అందజేశారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you