బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటాం: సీపీ రాజశేఖర్

5176చూసినవారు
బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటాం: సీపీ రాజశేఖర్
AP: కోడి పందేల శిబిరాల వద్ద బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటామని విజయవాడ సీపీ రాజశేఖర్ తెలిపారు. శిబిరాలను డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. కోళ్లకు కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండాట, పేకాట, క్యాసినోలు జరగనివ్వమని చెప్పారు. సంక్రాంతి అంటే కోడి పందేలు, జూదం, గుండాట, క్యాసినో కాదని అన్నారు. సంప్రదాయ ఆటలు ఆడుతూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్