నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి గొట్టిపాటి

104చూసినవారు
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి గొట్టిపాటి
AP: 'మొంథా' తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో గురువారం ఎమ్మెల్యే ఏలూరితో కలిసి ఆయన పర్యటించారు. అన్నంబొట్లవారిపాలెం, పర్చూరు ప్రాంతాల్లో పొంగుతున్న వాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లా వరకు వాగుల ఉద్ధృతితో పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని' హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్