టమోటా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతుండగా, వారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్‌లో టమోటా ధర రూ.9-18 మధ్య ఉండగా, వర్షాల కారణంగా ఎగుమతులు తగ్గాయని తెలిపారు. పత్తికొండ మార్కెట్ నుంచి 25 టన్నుల టమోటాలను చిత్తూరు ప్రాసెసింగ్ యూనిట్, రైతు బజార్లకు పంపిస్తున్నామని మంత్రి వెల్లడించారు.