ప్రతీ కార్యకర్తతో ప్రత్యేకంగా మాట్లాడతాం: నాగబాబు

8089చూసినవారు
ప్రతీ కార్యకర్తతో ప్రత్యేకంగా మాట్లాడతాం: నాగబాబు
AP: జనసేన కోసం పని చేస్తోన్న ప్రతీ కార్యకర్తతో సందర్భానుసారంగా ప్రత్యేకంగా మాట్లాడతామని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతీ నెల ఉత్తరాంధ్రలో జిల్లాల వారీగా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో కూడా సమీక్షలు ఏర్పాటు చేసి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తతో కూడా తప్పనిసరిగా మాట్లాడుతామన్నారు.

ట్యాగ్స్ :