రాయలసీమను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా మారుస్తాం: చంద్రబాబు

4747చూసినవారు
రాయలసీమను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా మారుస్తాం: చంద్రబాబు
AP: అక్టోబరు 2న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపనతో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. కరువుతో సతమతమైన రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దాలని, 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యాన పంటలు, ఎఫ్‌పీఓలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్‌ వ్యవస్థలను అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్