బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం.. ఏపీలో వర్షాలు

30చూసినవారు
బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం.. ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి శనివారం శ్రీలంకలోని ముల్లయిట్టివు సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం ఇది ముల్లయిట్టివుకు 30 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం నాటికి ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం నుంచి ఓ మోస్తరు వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.