AP: బలహీనపడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌పై కేంద్రీకృతమై ఉంది. మరో 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.