ఏపీ, తెలంగాణల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం, బుధవారం, గురువారం ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలోనూ రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.