TG: ఫార్మా రంగంలో పనిచేస్తున్న వధూవరులు తమ వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకి చెందిన ఉబ్బల శిరీష ఎం.ఫార్మసీ పూర్తి చేసి ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లకి చెందిన కిన్నెర నవీన్ ఎంబీఏ చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నారు. ఇద్దరూ ఫార్మా రంగంలో ఉండటంతో, టాబ్లెట్ షీట్ ఆకృతిలో పెళ్లి పత్రికను తయారు చేయించారు. చూడగానే మందుల స్ట్రిప్‌లా కనిపించే ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.