పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, దేశీయంగా ఇంధన కొరతను నివారించడానికి, విదేశాల్లోని భారతీయ పౌరుల భద్రత కోసం భారత ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతున్నప్పటికీ, భారత్ తన సన్నద్ధతతో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్యుడిపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.