
వృద్ధాశ్రమంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన మానవత సంస్థ
మానవత సంస్థ, భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన వర్మ మాతృమూర్తి పెన్మెత్స వెంకాయమ్మ వర్ధంతి సందర్భంగా, తాడేరు రోడ్డులోని వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు మంగళవారం పండ్లు, స్వీట్లు, భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, వేగేశ్న రామచంద్రరాజు, కమలాదేవి, సాగి అన్నపూర్ణ, పెన్మెత్స సూర్యనారాయణరాజు, వల్లి కుమారి, పెన్మెత్స సత్యనారాయణ రాజు, విజయరామరాజు, గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, కనుమూరి పెద్దిరాజులు పాల్గొన్నారు.





































