ఆచంట నటరాజ్ వీధికి చెందిన సఖినేటిపల్లి రాంబాబు (46) ఈ నెల 25న సైకిల్పై వెళ్తూ ఆచంట కచేరీ కూడలి వద్ద ప్రమాదానికి గురయ్యారు. తలకు గాయమైన ఆయనను బంధువులు గుర్తించి, విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు మృతి చెందినట్లు ఎస్సై కె. వెంకటరమణ శనివారం తెలిపారు. రాంబాబు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.