ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెనుగొండలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పురస్కార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 60 మంది ఉపాధ్యాయులను పూలమాలలతో సత్కరించి, సన్మాన పత్రాలు అందజేశారు. విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు.