పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో భవానీ పీఠం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. మాల ధరించిన భవానీ భక్తులతో పాటు సాధారణ భక్తులు ఉదయం పూజలు చేసి, బోనమెత్తుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, అమ్మవారి పీఠంలో సమర్పించారు. గురు భవానీలు గంట వాసు, రవికుమార్, భవానీ పీఠం సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.