పెనుగొండలో భారీ ఊరేగింపులతో నిమజ్జనం

615చూసినవారు
పెనుగొండ పట్టణంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాల నుంచి భారీ ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. 'బై బై గణేశా' అంటూ భక్తులు నినదిస్తూ, సాయంత్రం 10 గంటలలోపు గణనాథులను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ మహోత్సవాల సందర్భంగా, అన్ని ప్రాంతాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్