పెనుగొండ పుణ్యక్షేత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వర్గాలు భక్తులకు అన్నప్రసాద వితరణ, తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని దర్శించుకోవడం మహా పుణ్యమని భక్తులు విశ్వసిస్తున్నారు.