పెనుగొండ మండలంలో అల్పపీడన ప్రభావంతో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీని కారణంగా పెనుగొండ పట్టణంతో పాటు కొన్ని గ్రామాలలో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాతావరణ శాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజీవ్ సర్కిల్ పార్క్, బస్టాండ్, వంతెన వీధి, మరికొన్ని కాలనీలలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు, చిరు వ్యాపారులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.