పెనుగొండలోని కోడిపందాల దిబ్బ కాలనీలో నెలల క్రితం ప్రారంభమైన డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, నీరు నిలిచిపోయి మురుగు, దోమల బెడదతో అనారోగ్యానికి గురవుతున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రోడ్డుకు లింకు రోడ్లు కలపకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పనులు తక్షణమే పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.