పంట నష్టాల తగ్గింపునకు ప్లాంట్‌వైజ్‌ప్లస్ మొబైల్ యాప్

557చూసినవారు
పంట నష్టాల తగ్గింపునకు ప్లాంట్‌వైజ్‌ప్లస్ మొబైల్ యాప్
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మార్టేరు మరియు కాబి ఇంటర్నేషనల్ సంయుక్తంగా ప్లాంట్‌వైజ్‌ప్లస్ మొబైల్ అప్లికేషన్ పై "మాస్టర్ శిక్షకుల శిక్షణా కార్యక్రమం"ను మంగళవారం నిర్వహించాయి. ఈ యాప్ పంట నష్టాలను తగ్గించి, ఆహార భద్రతను పెంచడం, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. డా.టి.శ్రీనివాస్, మధు మంజరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ డిజిటల్ సాధనం ద్వారా రైతులు సమగ్ర పురుగులు, తెగుళ్ళ నివారణపై సమాచారం పొందవచ్చు, తద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్