తోకతిప్పలో రూ.18 లక్షల గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం

507చూసినవారు
తోకతిప్పలో రూ.18 లక్షల గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం
భీమవరం మండలం తోకతిప్ప గ్రామంలో రూ.18 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మరియు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ కార్యాలయం ద్వారా గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే మంచినీటి సమస్యను, రెండు ప్రధాన రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.