ఆచంట మండలం ఆచంట వేమవరం హైస్కూల్లో గ్రేడ్-2 HM అనుసూరి సత్యనారాయణను మనం పౌండేషన్ గురుదేవ జ్ఞాన జ్యోతి నేషనల్ అవార్డుకు ఎంపిక చేసి బుధవారం సమాచారం పంపినట్టు ఆయన తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా ఈ అవార్డు ఇస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ డా. కె. చక్రవర్తి తెలిపారని చెప్పారు. విద్యాశాఖ అధికారులు, STU ఆచంట మండలం శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం త్రిమూర్తులు, బండి ప్రసాద్, పణి కుమార్, కేశిరాజు కృష్ణ, శ్రీ అక్షర సేవా సమితి జిల్లా అధ్యక్షులు కే సూర్య కుమార్, సెక్రటరీ కే ఆడమ్స్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆచంట మండలం శాఖ, పాఠశాల ఉపాధ్యాయ బృందం , గ్రామ ప్రజలు
విద్యార్థులు తమ అభినందనలు తెలిపారు.