పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండల కేంద్రంలో విఆర్ఏలు తమ హక్కుల కోసం చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం నిర్విరామంగా కొనసాగాయి. మండలంలోని పలు గ్రామాల నుండి విఆర్ఏలు పెద్ద ఎత్తున తరలివచ్చి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లను వినిపించారు. తమకు దక్కాల్సిన హక్కులను వెంటనే నెరవేర్చాలని వారు కోరుతున్నారు.