పెనుగొండలో నీటి వృధా: అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ

728చూసినవారు
పెనుగొండ పట్టణంలో రామినీడి వారి వీధిలో పంచాయితీ వీధి కొళాయి నుంచి మంచినీరు గత కొన్ని రోజులుగా వృధాగా పోతోంది. వాటర్ పైపు జాయింట్ దెబ్బతినడం వల్ల నీరు డ్రైనేజీలోకి వెళుతోందని, అయినప్పటికీ స్థానిక పంచాయతీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే స్పందించి నీటి లీకేజీని అరికట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.