పశ్చిమ గోదావరిలో భారీ వర్షం

1337చూసినవారు
పశ్చిమ గోదావరిలో భారీ వర్షం
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1708.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గురువారం తెలిపింది. అత్యధికంగా తణుకులో 116.2 మి.మీ, తాడేపల్లిగూడెంలో 105.2 మి.మీ, పోడూరులో 103.6 మి.మీ వర్షం కురిసింది. అత్యల్పంగా అత్తిలిలో 38.6 మి.మీ, యలమంచిలిలో 59.6 మి.మీ నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 85.4 మి.మీగా అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్