నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం

4చూసినవారు
నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం
భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీరాజ్ భవనంలో పశ్చిమగోదావరి జిల్లా నూతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి కనుమూరి రామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ జుత్తుగ నాగరాజు తో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని ఎన్డీఏ కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్