కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడేనికి చెందిన అంజియ్య(25) సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసేందుకు అక్కడ ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో వైరల్ అయింది. ఇంటికి వెళ్తానంటే కొడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ కాపాడాలని వేడుకుంటున్నాడు. అంజియ్య తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఏజెంట్ ను విచారిస్తున్నారు.