
తుఫాన్ బాధితులకు కలెక్టర్ భరోసా, వైద్య సేవలు పరిశీలన
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి గారు అక్టోబర్ 28న పేరుపాలెం సౌత్ లోని బి.కె. మెరక తుఫాన్ సహాయ మరియు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ, వేడి భోజన వసతులను ఆమె పరిశీలించి, సేవలను మెరుగుపరచాలని సూచించారు. తుఫాన్ తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సముద్ర తీరాలకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. అధికారులు, వైద్య సిబ్బంది 24 గంటలు సేవలు అందించాలని ఆదేశించారు.



































