పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బాబా వారి మహా సమాధి చెంది 18 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నరసాపురం శ్రీ షిరిడి సాయి సేవ సత్సంగం ఆధ్వర్యంలో 108 రోజులు 108 గృహాలు 108 సత్సంగాలు కార్యక్రమం 92 రోజులో భాగంగా ఆదివారం ఉదయం డాక్టర్ నూలి శ్రీనివాస్ స్వగృహంలో సత్సంగం జరిగింది. ఈ సందర్భంగా సత్సంగం సభ్యులు నూలి శ్రీనివాస్ దంపతులకు ఆధ్యాత్మిక గ్రంథాలు అందజేసినారు. ఈ కార్యక్రమంలో సత్సంగం సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసినారు.