సముద్రం లో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

1197చూసినవారు
సముద్రం లో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
మొగల్తూరు పేరుపాలెం బీచ్ లో ఆదివారం సముద్ర స్నానానికి వచ్చిన పాలిటెక్నిక్ విద్యార్థి సిహెచ్ సుభాష్(17) గల్లంతయ్యాడు. పోలీసులు, మెరిన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, మల్లపర్రు సమీపంలో మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆదివారం గల్లంతైన సుభాష్ మృతదేహంగా గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్