మొగల్తూరు లోని వర్ధమాన వారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఐరావతం వాహనంపై అష్టలక్ష్మిలతో కూడిన మండపంలో గణనాథుని ఉంచి మేళ తాళాలతో బాణాసంచా కాల్పులతో గ్రామంలో బుధవారం శోభయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామంలోని కాలువలో నిమజ్జనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.