మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు శ్రీశ్రీశ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ చైర్మన్ కొల్లాటి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.