పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామ పంచాయతీలో అర్హులకు బుధవారం
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డులోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ పోలిశెట్టి గణేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడి, వారి యోగక్షేమాలను తెలుసుకుని పింఛన్లు అందజేశారు.