నరసాపురంలో చోరీ ఘటన కలకలం రేపుతోంది. తుందుర్రుకి చెందిన సీహెచ్ ముత్యాలరావు ఈ నెల 28న ఆచంట నుంచి నరసాపురం వచ్చారు. బస్టాండ్‌లో సాయి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి బార్‌కు వెళ్లి మద్యం సేవించి బయటకు వచ్చారు. ఆ తర్వాత ముత్యాలరావు బ్యాగును పరిశీలించగా అందులోని 17 గ్రాముల బంగారం కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం SI ప్రేమరాజు కేసు నమోదు చేశారు.